జులై నుంచి అంతర్జాతీయ విమాన సేవలు

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌ అనంతరం అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. జులై నుంచి విదేశాలకు విమాన రాకపోకలు పునరుద్ధరించే అవకాశం ఉందని విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా రెండు నెలల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో నిలచిపోయిన దేశీయ విమాన సర్వీసులను మే 25 నుంచి పునరుద్ధరించిన సంగతి తెలిసిందే.