గోపిచంద్ కథానాయకుడిగా నటించిన ‘పక్కా కమర్షియల్’ విడుదల తేదీ ఖరారైంది. జులై 1న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కరోనా కరుణిస్తే మే 20న విడుదల చేస్తామని చెప్పినప్పటికీ, విడుదల తేదీ విషయంలో మార్పు జరిగింది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో గోపీచంద్ న్యాయవాది పాత్రలో కనిపిస్తుండగా, రాశిఖన్నా సీరియల్ నటిగా కనిపిస్తారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు.
