జూనియర్ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్

కరోనా సెకండ్‌ వేవ్‌లో సామాన్యులే కాదు..ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇటు చిత్రపరిశ్రమనూ కోవిడ్‌ వెంటాడుతోంది. పవన్‌ కళ్యాణ్‌, అల్లుఅర్జున్‌, కళ్యాణ్‌దేవ్‌ వంటి స్టార్‌ హీరోలను కోవిడ్‌ తాకింది. తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇటీవల చేయించుకున్న పరీక్షల్లో కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను బాగానే ఉన్నాని తెలిపారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నానని, వైద్యుల సలహాలు తీసుకుంటున్నానని చెప్పారు. ఇటీవల తనను కలిసి వారు పరీక్షలు చేయించుకోవాలని ట్విట్టర్‌లో సూచించారు.