తిరుమలకు విచ్చేసే భక్తులు, స్థానికుల సౌకర్యార్థం టాటా ట్రస్టు సహకారంతో అశ్విని ఆసుపత్రిని అభివృద్ధి చేశామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి గారు తెలిపారు. ఆధునీకరించిన అశ్విని ఆసుపత్రిని శుక్రవారం ఉదయం పూజలు నిర్వహించి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఛైర్మన్ గారు మీడియాతో మాట్లాడుతూ టాటా ట్రస్టు రూ. 4 కోట్లతో ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చగా, టిటిడి రూ.65 లక్షలతో ఆసుపత్రి పరిసరాలను అభివృద్ధి చేసిందన్నారు. 30 పడకలు గల ఈ ఆసుపత్రిలో 2 ఐసియులు, మినీ ఆపరేషన్ థియేటర్, నూతన పరిశోధనశాల ఉన్నాయని తెలిపారు. అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన చికిత్స కూడా అందుబాటులో ఉందన్నారు. టిటిడికి సహకారం అందిస్తున్న టాటా ట్రస్టుకు, అపోలో ఆసుపత్రి సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

టాటా ట్రస్టు సహకారంతో తిరుమలలో అశ్విని ఆసుపత్రి అభివృద్ధి