టాలీవుడ్‌ యువ దర్శకుడు కరోనాతో మృతి

సినీపరిశ్రమను కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే సినీపరిశ్రమలో చాలామంది కరోనా బారినపడి మృతి చెందారు. తాజాగా… టాలీవుడ్‌ యంగ్‌ డైరెక్టర్‌ కుమార్‌ వట్టి (39) కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. కరోనా బారినపడిన కుమార్‌ వట్టి.. శ్రీకాకుళంలోని గ్రేట్‌ ఈస్టర్న్‌ మెడికల్‌ స్కూల్‌ అండ్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఈ విషయాన్ని విరాట పర్వం డైరెక్టర్‌ వేణు ఉడుగుల ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా కుమార్‌ వట్టి కుటుంబానికి ప్రగాఢసానుభూతి ప్రకటించారు.