టాలీవుడ్ లో కరోనా భయం: స్వీయ నిర్బంధంలో ప్రియదర్శి!

టాలీవుడ్ లో కరోనా భయం .. టాలీవుడ్‌ హాస్యనటుడు ప్రియదర్శి స్వీయ నిర్భందంలోకి వెళ్లిపోయారు. ప్రాణాంతక కరోనా (కోవిడ్‌) వ్యాప్తి నియంత్రణకు వ్యక్తిగత పరిశుభ్రత, ఇతరులకు దూరంగా ఉండటమే మేలైన మార్గాలని పలు పరిశోధనలు, వైద్యశాస్త్ర నిపుణులు చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభాస్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు జార్జియా వెళ్లిన ఆయన షూటింగ్‌ ముగించుకుని వచ్చారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో కరోనా వైరస్‌ స్క్రీనింగ్‌ అనంతరం ఆయన హోమ్‌ క్వారంటైన్‌లో ఉండిపోయారు. తనకు తాను క్లీన్‌ చిట్‌ ఇచ్చుకునేందుకు బాధ్యతగా 14 రోజులు ప్రజలకు దూరంగా ఉండాలని ప్రియదర్శి నిర్ణయించుకున్నారు.