టిడిపి కార్పొరేటర్‌ వానపల్లి రవి కుమార్‌ కరోనాతో మృతి

విశాఖ టిడిపి కార్పొరేటర్‌ వానపల్లి రవి కుమార్‌ కరోనాతో బాధపడుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. కరోనా బారినపడిన రవికుమార్‌ గత మూడు రోజులుగా విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మఅతి చెందారు. ఇటీవల జరిగిన జివిఎంసి ఎన్నికల్లో 31 వ వార్డు కార్పొరేటర్‌గా వానపల్లి రవి కుమార్‌ ఎంపికయ్యారు. గతంలో అనాథ శవాల అంత్యక్రియలు వంటి సామాజిక కార్యకలాపాలను రవికుమార్‌ నిర్వహించారు.