టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఇచ్చిన హామీలను విస్మరించి పాలిస్తోందని.. అందుకే ఇందిరా పార్కు వద్ద ధర్నా చేపట్టామని టీటీడీపీ నేత ఎల్.రమణ అన్నారు. స్థానిక సమస్యలను బహిర్గతం చేయాలనే అన్ని జిల్లాల నుంచి నాయకులను ఆహ్వానించామన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన సమయంలో సీఎం కేసీఆర్ వారిని ప్రత్యక్ష దేవుళ్ళు అన్నారని, తరవాత వారిని దెయ్యాలు అని మాట్లాడారని విమర్శించారు. సీఎం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు.

టీఆరఎస్ పై మండిపడ్డ ఎల్ రమణ