అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సమస్యలను ప్రస్తావిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మిషన్ కాకతీయ.. మీడియాలో తప్ప క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని ఆరోపించారు. కాళేశ్వరం ఎప్పుడు నింపుతారో ఎవరికీ తెలియదన్నారు. కాంగ్రెస్ పేదలకు భూములు పంచితే.. టీఆర్ఎస్ భూములు అమ్ముతోందని విమర్శించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ సత్తా చూపిస్తామని జగ్గారెడ్డి అన్నారు.

టీఆర్ఎస్ పై రెచ్చిపోయిన జగ్గారెడ్డి