తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు, టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టీడీపీకి మనుగడ లేదని విమర్శించారు. ఓ బీజేపీ నాయకుడి మాటలను టీడీపీ జిల్లా అధ్యక్షుడు వింటున్నారని… కనీసం తాను అడిగిన కార్పొరేటర్ టికెట్లు ఇవ్వలేని దుస్థితిలో పార్టీ ఉందని మండిపడ్డారు. త్వరలోనే తాను ఏ పార్టీలో చేరబోయేది ప్రకటిస్తానని కేఈ ప్రభాకర్ పేర్కొన్నారు.

టీడీపీ కి షాక్ ...కేఈ ప్రభాకర్ రాజీనామా