టీడీపీ పై ఫైర్ అయిన అనిల్ కుమార్ యాదవ్
టీడీపీ పై ఫైర్ అయిన అనిల్ కుమార్ యాదవ్

టీడీపీ పై ఫైర్ అయిన అనిల్ కుమార్ యాదవ్

టీడీపీ చౌకబారు రాజకీయాలు చేస్తోందని నీటి పారుదలశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మండలిలో నిన్న జరిగిన ఘటనలు దారుణమన్నారు. మండలిలో మేం ఏమైనా చేస్తామంటూ యనమల రామకృష్ణుడు మాట్లాడారని, రూల్‌ 90 నోటీసు ఒక రోజు ముందివ్వాలని చెప్పినా వినలేదని తెలిపారు. సంఖ్యా బలం ఉందని ప్రభుత్వ బిల్లులను అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర చేసిందని ధ్వజమెత్తారు.మండలిలో నారా లోకేష్‌ను వీడియోలు తీయొద్దని చైర్మన్ కూడా చెప్పారని, వీడియోలు తీయొద్దని చెబితే మంత్రి వెల్లంపల్లిపై దాడి చేశారని నిప్పులు చెరిగారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని టీడీపీ యత్నించిందన్నారు.అర్ధరాత్రి వరకు సమావేశాలు జరిగిన సందర్భాలు ఉన్నాయని, అయినా మండలిని నిరవధిక వాయిదా వేసి వెళ్ళిపోయారని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు