ట్రంప్‌పై ‘వర్మ’ సెటైర్‌!

 నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచే డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ ఈసారి ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పైనే సెటైర్లు విసిరి మరోసారి వార్తలో నిలిచారు. ట్రంప్‌పై వర్మ చేసిన ఓ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ‘ఇది చాలా అద్భుతం.. కేవలం ఒకే ఒక్క మనిషి డొనాల్డ్‌ ట్రంప్‌.. అమెరికాను ఒక జోక్‌లా చూసేలా చేశారు’ అని ట్వీట్‌ చేశారు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. ఆయన చేసిన ట్వీట్‌పై స్పందిస్తోన్న నెటిజన్లు ‘నీ దష్టి కొన్ని రోజులుగా డొనాల్డ్‌ ట్రంప్‌పై పడిందేంటీ?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ట్రంప్‌ చేసే వ్యాఖ్యలు విచిత్రంగా ఉంటున్నాయంటూ తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి.