ట్రంప్‌ గో బ్యాక్‌

ట్రంప్‌ గో బ్యాక్‌

దేశ రాజధాని ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా అమె రికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటనను నిరసిస్తూ సోమవారం ఆందోళనలు చోటుచేసు కున్నాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ లో అఖిల భారత స్వేచ్ఛ, సంఘీభావ సంస్థ (ఎఐపిఎస్‌ఒ) సమన్వయంలో సిపిఎం, సిపిఐ, ఎస్‌యుసిఐ, సిజిపిఐతో పాటు ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, సిఐటియు, ఎఐవైఎఫ్‌, ఎఐడిఎస్‌ఒ, ఢిల్లీ సైన్స్‌ ఫోరం, కెవై ఎస్‌, ఎఐడివైఒ తదితర సంఘాలు ‘గో బ్యాంక్‌ ట్రంప్‌’ కార్యక్రమం నిర్వ హించాయి. సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు నిలోత్పల్‌ బసు, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తదితరులు ప్రసంగిం చారు. హైదరాబాద్‌లోని బేగంపేటలోని అమెరికా కాన్సులేట్‌ వద్ద పలు ప్రజాసంఘాలు ఆందోళన నిర్వహించాయి. ట్రంప్‌ గో బ్యాక్‌ నినాదాలతో యుఎస్‌ కాన్సులేట్‌ ప్రాంతం ప్రతిధ్వనించింది. హైదరా బాద్‌ ఆర్‌టిసి క్రాస్‌ రోడ్స్‌ వద్ద నిరసన తెలుపు తున్న ప్రజాసంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణా వ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు నిర్వహించారు. కేరళ, బెంగాల్‌, అస్సాం, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. వామపక్షాల ఆధ్వర్యాన ఆంధ్రప్రదేశ్‌ లోని విజయవాడ, గుంటూరు, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర, కర్నూలు, కడప తదితర జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తాయి.