ట్రంప్‌ వీడియోను తొలగించిన ట్విట్టర్‌

ట్రంప్‌ వీడియోను తొలగించిన ట్విట్టర్‌

నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ హత్యపై స్పందిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్‌ చేసిన వీడియోను ట్విట్టర్‌ తొలగించింది. ఈ వీడియో తమ కాపీరైట్‌ నిబంధనలను ఉల్లగిస్తోందని ట్విట్టర్‌ తెలిపింది. ట్రంప్‌ ట్వీట్‌ చేసిన వీడియోలోని కొంత ఫుటేజ్‌పై ట్విట్టర్‌కు ఫిర్యాదు అందింది. తమ వీడియోస్‌ను ఉపయోగించి ఈ వీడియో తయారు చేశారని ఒకరు ఫిర్యాదు చేయడంతో ట్విట్టర్‌ మూడు నిమిషాల నిడివి ఉన్న ట్రంప్‌ వీడియోను తొలగించింది. ట్రంప్‌ ట్వీట్‌లను తొలగించడం ఇదే మొదటిసారి కాదు. కొద్ది రోజుల క్రితం మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌పై ట్రంప్‌ చేసిన ట్వీట్‌లను కూడా ట్విట్టర్‌ తొలగించింది. ఈ ట్వీట్లు తప్పుఉ సమాచారాన్ని ఇస్తున్నాయనే కారణంతో తొలగించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్‌ ట్విట్టర్‌ను మూసేస్తామని బెదిరించారు. దీనిపై ట్విట్టర్‌ సిఈవో జాక్‌ డోర్సీ ఘాటుగా స్పందించారు. తప్పుడు సమాచారాన్ని అడ్డుకుంటూనే ఉంటామని, తమ బాధ్యతలను ఎప్పుడూ నిర్వరిస్తామని బదులిచ్చారు. ఇది జరిగి కొద్ది రోజులు గడవకముందే వీడియోను తొలగించి ట్రంప్‌తో ఢ కొట్టేందుకు ట్విట్టర్‌ సిద్దమైంది.