బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న అనంతరం పలువురు నటీనటులు, ముఖ్యంగా వారసత్వంగా సినీ పరిశ్రమకు వచ్చినవారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెపోటిజం (బంధుప్రీతి) కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘బారుకాట్ బాలీవుడ్’ అనే హాష్‌ట్యాగ్ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో.. ఆమె ట్విటర్ ఖాతా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కాగా, తాను ట్విట్టర్ ఖాతా నుండి తప్పుకుంటున్నానని స్వయంగా హీరోయిన్ సోనాక్షీ సిన్హా వెల్లడించారు. ”నీ చిత్తశుద్ధిని కాపాడుకోవాలంటే వేయాల్సిన తొలి అడుగు నెగటివిటీకి దూరంగా ఉండటమే. ముఖ్యంగా ఈ సమయంలో ట్విట్టర్‌కి దూరంగా ఉండాలి. ఛలో.. నేను నా అకౌంట్‌ని డీయాక్టివేట్ చేస్తున్నా. బై గైస్… ఇక ప్రశాంతంగా ఉండండి ” అని ట్వీట్ చేసింది.
