డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాలపై కేటీఆర్‌ సమీక్ష

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ కార్యక్రమంపై బుధవారం ఆయన ప్రశాంత్‌రెడ్డిలు ఉన్నత స్థాయితో సమీక్ష సమావేశంచ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నగరంలో ఇప్పటికే చాలా చోట్ల 80 శాతానికిపైడా నిర్మాణాలు పుర్తయ్యాయని తెలిపారు.కొన్ని చొట్ల లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. త్వరలోనే మిగితా నిర్మాణాలను కూడా పూర్తి చేసి లబ్థిదారులకు అందించే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు.