కరోనా బాధితులకు నిర్విరామంగా కృషిచేస్తున్న డాక్టర్ల ఆరోగ్యం దృష్ట్యా కేజ్రివాల్ ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని లోక్‌నాయక్, జీబీ పంత్ ఆసుపత్రులలో పనిచేస్తున్న వైద్యులను లలిత్ హోటల్లో ఉంచనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కరోనా వైరస్ వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో విధుల్లో ఉన్న వైద్యనిపుణులు, ఆరోగ్య కార్యకర్తలను 14 రోజులపాటు లలిత్ హోటల్లోనే ఉంచాలని నిర్ణయించింది. ప్రాణాంతక ఈ వైరస్ డాక్టర్లు, వారి కుటుంబాలకు కూడా సోకుతున్న నేపథ్యంలో సర్కార్ ఈ ప్రణాళిక ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ట్వీట్ చేసింది.

డాక్టర్ల కోసం ప్రత్యేక క్వారంటైన్ హాస్పిటల్