డ్రగ్స్‌ కేసులో షారూఖ్‌ఖాన్‌ కుమారుడికి క్లీన్‌ చిట్‌

 డ్రగ్స్‌ కేసులో షారూఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) శుక్రవారం క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.  ఆర్యన్‌ఖాన్‌, ఇతరుల వద్ద ఎలాంటి డ్రగ్స్‌ దొరకలేదని, అలాగే వారు డ్రగ్స్‌ తీసుకున్నట్లు సరైన ఆధారాలు లేవంటూ ఎన్‌సిబి చార్జిషీట్‌లో పేర్కొంది. మరో 14 మందిపై చార్జిషీట్‌ నమోదు చేసింది. షారూఖ్‌ ఖాన్‌, ఆర్యన్‌ ఖాన్‌ ఇద్దరికి ఉపశమనం లభించిందంటూ న్యాయవాది ముఖుల్‌ రోహత్గి పేర్కొన్నారు. ”ఆర్యన్‌, అతడి తండ్రి షారుక్‌కు గొప్ప ఉపశమనం లభించినట్లయింది. నిజం ఇప్పటికైనా బయటపడింది. ఆర్యన్‌ వద్ద ఎలాంటి మాదకద్రవ్యాలు లభించలేదు.