ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరాపై సుప్రీం వ్యాఖ్యలు

ఢిల్లీకి ప్రతి రోజూ 700 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను అందించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు దీన్ని కొనసాగించాలని స్పష్టం చేసింది. ఢిల్లీలోని ఆసుపత్రులకు వచ్చే కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా ఏర్పడటంతో…కరోనాను కట్టడి చేయలేక ఆసుపత్రులు చేతులెత్తేస్తున్నాయి. దీనిపై జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టు ప్రతిరోజూ 700 మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను ఢిల్లీకి సరఫరా చేయాలని చెప్పినప్పుడు….అంతే పంపాలని, బలవంతపు చర్యలు తీసుకునే పరిస్థితి వైపుకు మమ్మల్ని తీసుకువెళ్లవద్దని కేంద్రాన్ని హెచ్చరించింది. దేశంలో ఏర్పడ్డ ఆక్సిజన్‌ కొరతపై సుప్రీంకోర్టు మూడు రోజుల నుండి వరుసగా విచారణ చేపడుతోంది.