ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఓట్లలెక్కింపుప్రారంభమైంది. ఓట్లలెక్కింపు సందర్భంగా ఢిల్లీలో భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని 11 జిల్లాల్లో మొత్తం 21 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సీడబ్ల్యూజీ స్పోర్ట్సు కాంప్లెక్స్, ఎన్ఎస్ఐటీ ద్వారక, మీరాబాయి, జీబీపంత్ కాలేజీలు, రాజీవ్ గాంధీ స్టేడియం, సర్ సీవీ రామన్ ఐటీఐ, సెంట్రల్ ఢిల్లీ ప్రాంతాల్లోని కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బలగాలను మోహరించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన నేపథ్యంలో ఆప్ కార్యకర్తలు అర్వింద్ కేజ్రీవాల్ ఇంటికి తరలివస్తున్నారు.