ఢిల్లీ చేరుకున్న జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఎంపి విజరుసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు ప్రధాని మోడీతో భేటీకానున్నారు. 4గంటల 45 నిమిషాలకు ప్రధానితో సమావేశం కానున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో కూడా సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ సవరించిన అంచనాల ఆమోదం, విభజన నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ గ్యాప్‌ విడుదల అంశాన్ని ప్రధాని  దృష్టికి తీసుకెళ్లనున్నారు.