మహేష్‌బాబు, కీర్తిసురేష్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్థిక కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య మన తెలుగు సినిమాలన్నీ ఏకకాలంలో.. వివిధ భాషల్లోనూ విడుదలవుతున్నాయి. ‘సర్కారు వారి పాట’ చిత్రం కూడా.. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం ఆయా భాషలకు సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంటున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ మూవీ తమిళ వెర్షన్ అప్డేట్స్ కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పరుశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్నారు.
