తమిళ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఆయన సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ సినిమా ఇండిస్టీలో మంచి క్రేజ్, మార్కెట్ ఉన్న హీరోలలో ఆయన కూడా ఒకరు. త్వరలో ఆయన హీరోగా నటించిన ‘నెంజుకు నీధి’ అనే సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. మే 20న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను బాలీవుడ్లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘ఆర్టికల్ 15’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కించారు. సెల్వరాజ్ దర్శకత్వంలో ‘మామన్నన్’ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్గా, మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదే తన చివరి సినిమా అంటూ ఉదయనిధి స్టాలిన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్.
