తాడేపల్లికి చేరుకున్న జగన్‌

వైఎస్‌ జగన్‌ దావోస్‌ పర్యటనను ముగించుకుని మంగళవారం తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రితోపాటు వెళ్లిన మంత్రుల బృందం నేడు స్వదేశానికి చేరుకుంది. విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సిఎం జగన్‌కు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.