తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సిఎం జగన్‌

కర్నూలు జిల్లా సంకల్‌బాగ్‌ ఘాట్‌ లో తుంగభద్ర పుష్కరాలను ఎపి సిఎం జగన్‌ శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సిఎం జగన్‌ సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి, తుంగభద్ర నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు-కుంకుమ, సారెలను సమర్పించి ఆపై హారతి ఇచ్చారు. హోమంలో పాల్గొన్నారు.       పుష్కరాల ప్రారంభోత్సవంలో సిఎం జగన్‌ వెంట మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, గుమ్మనూరు జయరాం, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. తుంగభద్ర పుష్కరాలు నేటి నుంచి డిసెంబరు ఒకటవ తేదీ వరకు కొనసాగనున్నాయి. పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో కలిపి 23 పుష్కర ఘాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. పుష్కరాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని నేటి సాయంత్రం గంగా హారతి ఉంటుందని ప్రకటించారు. సంకల్‌బాట్‌ ఘాట్‌లో12 రోజులపాటు నిత్య హోమాలను నిర్వహించనున్నట్లు అధికారులు వివరించారు. ఆత్మకూరు డిఎస్‌పి శృతి పుష్కరాల ఏర్పాట్ల పై అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.