రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం ఒక్కరోజే 879 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. రోజువారీగా నమోదవుతున్న కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9,553కి చేరింది. ప్రస్తుతం 5,109 మంది వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్‌లలో చికిత్స పొందుతుండగా.. 4,224 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మంగళవారం రాష్ట్రంలో మరో ముగ్గురు మృతి చెందడంతో రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 220కి పెరిగింది.
ఇక తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 652 ఉండగా.. మేడ్చల్ జిల్లాలో 112, రంగారెడ్డి జిల్లాలో 64, వరంగల్ రూరల్‌లో 14, కామారెడ్డిలో 10, వరంగల్ అర్బన్‌లో 9, జనగామ జిల్లాలో 7, నాగర్‌కర్నూల్ జిల్లాలో 4, మంచిర్యాల, మహబుబాబాద్ జిల్లాల్లో రెండు చొప్పున, మెదక్ జిల్లాలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. మంగళవారం 3,006 మందికి పరీక్షలు నిర్వహించగా 2,127 మందికి నెగిటివ్ వచ్చినట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.