తెలంగాణలో టెన్త్‌ పరీక్షలు వాయిదా

తెలంగాణలో టెన్త్‌ పరీక్షలు వాయిదా

తెలంగాణలో సోమవారం నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. హైదరాబాద్‌ పరిధిలో మినహా మిగతా అన్ని జిల్లాల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.. అయితే హైకోర్టు తీర్పు కాపీలు అందగానే చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది. విద్యాశాఖ అధికారులతో సిఎం కెసిఆర్‌ చర్చల అనంతరం పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.