తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా

 కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టు శుక్రవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. శనివారం జరగనున్న పరీక్ష యథాతథంగా కొనసాగించాలని పేర్కొంది. సోమవారం(మార్చి23) నుంచి మార్చి 30వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు తెలిపింది. కరోనా పరిస్థితిని బట్టి మర్చి 30 నుంచి ఏప్రిల్‌ 6వరకు జరగనున్న పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. మార్చి 29న అత్యుతన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది