తెలంగాణలో మరో మూడు కరోనా కేసులు
తెలంగాణలో మరో మూడు కరోనా కేసులు

తెలంగాణలో మరో మూడు కరోనా కేసులు

తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. లండన్‌ నుంచి వచ్చిన రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి, జర్మనీ నుంచి వచ్చిన చందానగర్‌కు చెందిన 39 ఏళ్ల వివాహితకు, సౌదీ అరేబియా నుంచి వచ్చిన బేగంపేటకు చెందిన 61 ఏళ్ల మహిళకు కరోనా సోకినట్టుగా తెలిపింది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 36కు చేరింది.