తెలంగాణలో సహకార సంఘాల ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

తెలంగాణలో సహకార సంఘాల ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

తెలంగాణలో సహకార సంఘాల ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. మూడు మినహా 906 సహకార సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగగా, సాయంత్రానికి ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో  12 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల విధుల్లో 747 మంది గెజిటెడ్‌ అధికారులు పాల్గొన్నారు.