తెలంగాణాలో రేపటి నుండి లాక్‌డౌన్‌

కరోనా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బుధవారం నుండి 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. లాక్‌డౌన్‌ సమయంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసరాల, ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు అవకాశమిచ్చింది. అనంతరం అత్యవసర సేవలు మినహాయించి మిగిలిన సేవలన్నీ నిలిచిపోతున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలు అమలు అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆదేశించారు.