తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరవీరులకు సీఎం కేసీఆర్ ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం ప్రగతిభవన్ నుంచి గన్‌పార్క్‌కు చేరుకున్న ఆయన అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు అమరవీరులకు నివాళులు అర్పించారు. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం ప్రగతిభవన్‌లో కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు
