తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి బండి సంజయ్‌ సారథి అయ్యారు. హిందుత్వ ఎజెండాను అమలు చేయడంలో, టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కోవడంలో ముందుండటంతో జాతీయ నాయకత్వం సంజయ్‌ వైపు మొగ్గు చూపింది. ఆర్‌ఎస్‌ఎస్‌తో ఉన్న అనుబంధం, పార్టీ ఆదేశాలను తు.చ. తప్పకుండా పని చేసే నేతగా, పక్కా హిందూత్వవాదిగా పేరుండటంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ సంజయ్‌ను బుధవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, హెడ్‌ క్వార్టర్స్‌ ఇన్‌చార్జి అరుణ్‌సింగ్‌ నియామక పత్రం జారీ చేశారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన సంజయ్‌కి యువతలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో గెలవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.