తెలుగు అభిమానుల కోసం ‘బుట్టబొమ్మ’ సూచనలు

కరోనా మహమ్మారిని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే పలు సూచనలు చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తెలుగు అభిమానుల కోసం విడుదల చేసిన ఈ వీడియోలో తెలుగులోనే మాట్లాడుతూ ఆశ్చర్యపరిచారు. ‘హారు నేను మీ పూజా హెగ్డే. తెలుగు ప్రజలు అందరికీ నమస్కారం. ఇప్పుడు కంటికి కనిపించని శత్రువు కరోనాతో మనమంతా యుద్ధం చేస్తున్నాం. ఇందులో విజయం సాధించాలంటే ఇంట్లోనే ఉండాలి. ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు వెళ్లవద్దు. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్క్‌, గ్లవ్స్‌ ధరించండి. చేతులకు సానిటైజర్‌ రాసుకోండి. సోషల్‌ డిస్టెన్స్‌ మెయింటైన్‌ చేయండి. ఇంట్లోనే ఉండండి, భద్రంగా ఉండండి’ అంటూ పూజా పేర్కొన్నారు. టాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన అలవైకుంఠపురంలో సినిమాతో అభిమానులను అలరించిన ఈ భామ.. ప్రస్తుతం ప్రభాస్‌, అఖిల్‌ చిత్రాల్లో, బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌, అక్షరుకుమార్‌ సినిమాల్లో నటిస్తున్నారు.