తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం
తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం

తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధంలో త‌న వంతు భాగ‌స్వామ్యం అందించడానికి హీరో నితిన్ ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనాను ఎదుర్కొవడానికి తనవంతుగా రూ. 20 లక్షల విరాళం ప్రకటించారు. క‌రోనా క‌ట్ట‌డికి రెండు తెలుగు రాష్ట్రాలు చిత్త‌శుద్ధితో కృషి చేస్తున్నాయ‌ని ప్ర‌శంసించిన ఆయ‌న‌, ప్ర‌జ‌లంద‌రూ రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి రూ. 10 ల‌క్ష‌ల చొప్పున విరాళాన్ని అందజేయనున్నట్టు నితిన్ తెలిపారు.