తెలుగు రాష్ట్రాలకు శుభవార్త…పండుగ వేళ ప్రత్యేక రైళ్లు

దసరా పండుగ వేళ.. ప్రయాణీకుల సౌకర్యార్థం రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 666 మెయిల్‌ / ఎక్స్‌ప్రెస్‌ లను ప్రత్యేకంగా నడపనుంది. కరోనా నేపథ్యంలో.. చాలా వరకు రైళ్ల సర్వీసులను నిలిపేసిన రైల్వే శాఖ .. ప్రస్తుతం పండుగ నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా 392 ప్రత్యేక రైళ్లను ఈనెల 20 వ తేదీ నుండి వచ్చే నెల 30 మధ్య నడపనుంది. వీటికి అదనంగా 50 రోజులపాటు పండుగ ప్రత్యేక రైళ్లు కూత పెట్టనున్నాయి. కేవలం పండుగ నేపథ్యంలో.. ఈ సర్వీసులను అందిస్తున్నామని, నవంబర్‌ 30 తర్వాత ఈ సర్వీసులు కొనసాగబోవని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. పండుగ వేళ కూత పెట్టనున్న ఈ ప్రత్యేక రైళ్లకు వర్తిస్తున్న రుసుములే వీటికి కొనసాగుతాయి. ఆయా తరగతులను బట్టి సాధారణ రైళ్లతో పోలిస్తే.. 10 – 30 శాతం మేర ఎక్కువగా టికెట్‌ ధర ఉంటుంది. ప్రత్యేకంగా నడుపుతున్న ఈ రైళ్లతో తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు కూడా ఊరట కలగ నుంది. కొన్ని రైళ్లు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాగా…మరికొన్ని రైళ్లు తెలుగు రాష్ట్రాల గుండా ఇతర రాష్ట్రాలకు వెళతాయి.