కరోనా వైరస్ ప్రభావంతో దేశమంతా లాక్ డౌన్ అయ్యింది. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో కరోనా వైరస్ గురించి అవగాహన కల్పిస్తూ సినీ తారలు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందరినీ ఇళ్లకే పరిమితం కావాలంటూ సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు కథానాయకులు చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి తేజ్ కలిసి కోటి సంగీత సారథ్యంలో రూపొందించిన ఓ స్పెషల్ సాంగ్‌లో నటిస్తూ కరోనా వైరస్ ప్రభావాన్ని నివారించడానికి సామాజిక దూరం పాటించాలన్నారు. దీని గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి తేజ్‌లను అభినందిస్తూ తెలుగులో ట్వీట్ చేశారు.

తెలుగు హీరోలను పొగుడుతూ మోడీ తెలుగు ట్వీట్