త్వరలోనే తెలంగాణ ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్‌
త్వరలోనే తెలంగాణ ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్‌

త్వరలోనే తెలంగాణ ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్‌

తెలంగాణ‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో త్వరలోనే వెల్లడిస్తామని రాష్ట్ర విద్యాశాఖ ప్ర‌క‌టించింది. మార్చి 23 నుంచి 30 వరకు జరగాల్సిన ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను హైకోర్టు ఆదేశాలతో వాయిదా వేసిన తెలిసిందే. అయితే మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 7 వరకు పరీక్షలను నిర్వహించాలని తొలుత ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మరోసారి వాయిదా తప్పలేదు.ఈ మేరకు భార‌త్‌లో క‌రోనా వ్యాప్తిని నివారించేందుకు ఏప్రిల్ 14 వ‌ర‌కు లాక్‌డౌన్ విధించిన నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఏ. సత్యనారాయణ రెడ్డి సోమవారం వెల్ల‌డించారు. వాయిదా ప‌డిన ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌తోపాటు అన్ని ఇత‌ర ప‌రీక్ష‌ల రీ షెడ్యూల్ తేదీల‌ను త‌ర్వ‌లోనే వెల్ల‌డిస్తామ‌ని ఆయ‌న తెలిపారు.