థియేటర్‌లో సినిమా వీక్షణ సురక్షితం

మాల్స్‌, పబ్బులకు వెళ్లి మాస్కులు తీసి ఎంజారు చేసే వాళ్ల కంటే థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవాళ్లే సురక్షితం!’ అంటూ హీరో నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్యదేవ్‌ – ప్రియాంకా జవాల్కర్‌ జంటగా శరణ్‌ కొప్పిశెట్టి తెరకెక్కించిన ‘తిమ్మరుసు’ ప్రమోషనల్‌ కార్యక్రమంలో నాని పైవిధంగా కామెంట్‌ చేశారు. ఇంకా ‘చాలామంది పబ్బులు క్లబ్బులు మాల్స్‌కి వెళ్లి మాస్కులు తీసేసి మాట్లాడుతున్నారు. దానికంటే థియేటర్లలో కూచున్న ప్రేక్షకులు చాలా సురక్షితం.