దసరా తర్వాత ఆంగ్ల మాధ్యమం పిటిషన్‌పై విచారణ…

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలన్న అంశంపై సుప్రీంకోర్టులో విచారణ మంగళవారం వాయిదా పడింది.  ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. అయితే,  హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బొబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. దసరా సెలవుల తర్వాత విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.