దీపావళికి RRR కన్నుల పండుగ

 దీపావళి కానుకగా…. అభిమానులకు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నుండి ఓ ఫొటోను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఈ ఫొటో రాజమౌళి, చరణ్‌, ఎన్టీఆర్‌లు సాంప్రదాయ దుస్తులను ధరించి వరుసగా కూర్చొని.. స్వీట్లు తింటూ.. ఏవో సరదా సంభాషణలు మాట్లాడుకుంటున్నట్లుగా ఉంది. వెనుక బ్యాంక్‌గ్రౌండ్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ లైటింగ్‌లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో జక్కన్న దీపావళి కానుకగా ఏదో ప్లాన్‌ చేసినట్లుగా అనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోనే కాకుండా.. వీడియో కూడా విడుదల చేసి ఉంటే బాగుండేదని అభిమానులు ఆశపడుతున్నారు. కాగా వీడియో వచ్చినా, రాకున్నా ఈ ఫొటో మాత్రం ఈ ముగ్గురి అభిమానులకు అతి పెద్ద దీపావళి కానుక. దీపావళికి ఆర్‌ఆర్‌ఆర్‌ నుండి సర్‌ప్రైజ్‌ రాబోతుందంటూ రెండు రోజుల క్రితమే ప్రచారం జరిగింది. ఆ సర్‌ప్రైజ్‌ ఇదే అయ్యి ఉంటుందని కొందరు.. ఇంకా ఏమైనా ఉందా అంటూ మరి కొందరు నెట్టింట కామెంట్స్‌ చేస్తున్నారు.