దేశంలో ఒక్క రోజే 7964 కేసులు

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7964 కొత్త కరోనా కేసులు నమోదు కాగా 265 మంది మరణించారు. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే గరిష్టం కావడం గమనార్హం. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,73,763కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 82,369 మంది కరోనా నుంచి కోలుకోగా.. 4,971 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 86,422 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి