దేశంలో మళ్లీ కరోనా విజృంభణ

దేశంలో కరోనా తగ్గుముఖం పట్టినట్లు పట్టి, మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో నమోదైన గణాంకాలే అందుకు నిదర్శనం. గత 24 గంటల్లో దేశంలో 44, 376 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 92, 22, 217కు చేరువైంది. గడిచిన 24 గంటల్లో 37, 816 మంది కోలుకోగా, మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య కూడా 86 లక్షలను దాటింది. అదేవిధంగా 481 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు 1,34, 699 మంది కరోనాకు బలయ్యారు. భారత్‌లో మరణాల రేటు 1.46 శాతంగా వుంది. రికవరీ రేటు కూడా 93.72 శాతం నమోదైంది. ప్రస్తుతం దేశంలో 4,44,746 యాక్టివ్‌ కేసులున్నాయి. క్రియాశీల రేటు 4.82 శాతం. దేశంలో ఇప్పటి వరకు 13,48,41,307 కోవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్లు ఐసిఎంఆర్‌ వెల్లడించింది.