శంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 9,971 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,46,628కి చేరుకుంది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కాగా గత 24గంటల్లో 287 మరణాలు చోటుచేసుకోగా మొత్తం మరణాల సంఖ్య 6929కి చేరింది. కాగా కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,19,293గా ఉంది. ప్రస్తుతం దేశంలో 1,20,406 యాక్టివ్ కేసులు ఉన్నాయి.కాగా దేశంలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 46,66,386గా ఉంది,
