దేశవ్యాప్తంగా 24 గంటల్లో 10,667 కేసులు

దేశవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళనకరంగా మారింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,667 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 380 మంది మృత్యువాతపడ్డారు. కొత్త కేసులతో కలుపుకొని దేశంలో ఇప్పటివరకు 3,43,091 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,80,013 మంది మహమ్మారి కరోనా నుంచి కోలుకోగా.. 9,900 మంది మృతి చెందారు. ప్రస్తుతం 1,53,178 కరోనా యాక్టీవ్‌ కేసులు దేశంలో ఉన్నాయి