దేశవ్యాప్తంగా 49 వేలు దాటిన కేసులు
దేశవ్యాప్తంగా 49 వేలు దాటిన కేసులు

దేశవ్యాప్తంగా 49 వేలు దాటిన కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 2,958 కరోనా కేసులు నమోదు కాగా, 126 మంది మృతిచెందారు. దీంతో భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 49,391కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 14,182 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 1,694 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 33,514 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.