‘ధోనీ’ హీరో సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (34)ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ధోనీ బయోపిక్‌లో హీరోగా నటించిన విషయం తెలిసిందే. పలు టీవీ సీరియళ్లలో నటించిన సుశాంత్‌ సింగ్‌, 1986 జనవరి 21న పట్నాలో జన్మించాడు. 2013లో వచ్చిన ‘కై పో చే’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సేవా కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సుశాంత్ ఫర్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో సేవా సంస్థ కూడా నిర్వహిస్తున్నాడు.