నగరి మున్సిపల్‌ కమిషనర్‌పై సస్పెన్షన్‌ వేటు
నగరి మున్సిపల్‌ కమిషనర్‌పై సస్పెన్షన్‌ వేటు

నగరి మున్సిపల్‌ కమిషనర్‌పై సస్పెన్షన్‌ వేటు

చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. కరోనా నివారణపై ఆయన చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహిత్యంగా ఉన్నాయంటూ ఈ చర్యలు తీసుకుంది. ఈ మేరకు నగరి మున్సిపల్‌ కమిషనర్‌ను సస్పెండ్‌ చేస్తూ మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.