నయనతార వివాహతేదీ ఎప్పుడంటే…?!

 ప్రముఖ స్టార్‌ హీరోయిన్‌ నయనతార త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. నయనతార, డైరెక్టర్‌ విఘ్నేష్‌ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేశాయి. అయితే ఈ వార్తలపై నయన్‌ స్పందించి.. ‘నా పెళ్లికి సంబంధించిన వార్తలన్నీ కేవలం పుకార్లే. నేను పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటాను. అప్పటివరకు ఎలాంటి రూమర్స్‌ క్రియేట్‌ చేయొద్దు’ అని అన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. వచ్చే నెల జూన్‌ 9న తిరుమలలో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు (మే 7) ఈ జంట తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తిరుమలలోనే వీరి వివాహం జరగబోతున్నట్లు.. దీనికిగాను వివాహ వేదికను బుక్‌ చేసేందుకు వచ్చినట్లు తెలిపారు.