నాలుగు లక్షలకు చేరువలో కరోనా కేసులు

 దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కొత్త కేసులు పెరగడమే కాకుండా.. అత్యధిక సంఖ్యలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 3,86,452 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో మొత్త కోవిడ్‌ కేసుల సంఖ్య 1,8a7,62,976కు చేరింది. ఇక గురువారం ఒక్కరోజే 3,498 మంది కరోనాబారిన పడి మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 2,08,330కు చేరింది. అలాగే దేశవ్యాప్తంగా శుక్రవారం ఉదయానికి 31,70,228 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక కరోనా నుంచి 2,97,540 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.